హెడ్‌ఫోన్స్ వాడకం.. వినికిడి శక్తికి ముప్పు!

155చూసినవారు
హెడ్‌ఫోన్స్ వాడకం.. వినికిడి శక్తికి ముప్పు!
ప్రపంచవ్యాప్తంగా యువత హెడ్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్‌ను అధికంగా వాడటం వల్ల వినికిడి శక్తిని కోల్పోతున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వాల్యూమ్‌లో పాటలు వినడం, నాణ్యత లేని పరికరాలు వాడటం వల్ల చెవి నొప్పి, చెవిలో రింగింగ్ శబ్దాలు, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. నిపుణుల సూచనల ప్రకారం, మితమైన వాల్యూమ్‌లో వినడం, మధ్యమధ్యలో విరామం తీసుకోవడం, నాణ్యమైన హెడ్‌ఫోన్స్ వాడటం, చెవులను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వినికిడి శక్తిని కాపాడుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్