ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


బంగారం ధరలపై కేంద్రం స్పందన: నియంత్రణకు ప్రణాళిక లేదన్న నిర్మల సీతారామన్
Dec 15, 2025, 16:12 IST/

బంగారం ధరలపై కేంద్రం స్పందన: నియంత్రణకు ప్రణాళిక లేదన్న నిర్మల సీతారామన్

Dec 15, 2025, 16:12 IST
దేశవ్యాప్తంగా బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్యులకు షాక్ కలిగిస్తున్నాయి. తులం బంగారం లక్షా 30 వేలకు, కేజీ వెండి రెండు లక్షలకు చేరుకుంది. బంగారం ధరలను నియంత్రించాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, బంగారం ధరలను నియంత్రించే ప్రణాళిక తమ వద్ద ఏమీ లేదని తెలిపారు. ప్రపంచవ్యాప్త డిమాండ్, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ విధానాలు ధరలను ప్రభావితం చేస్తాయని, ప్రస్తుతానికి ధరలను నియంత్రించే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేశారు.