బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టేందుకు వైభవ్ సూర్యవంశీ సిద్ధం!

5725చూసినవారు
బాబర్ ఆజం రికార్డును బద్దలు కొట్టేందుకు వైభవ్ సూర్యవంశీ సిద్ధం!
అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు దూసుకుపోతోంది. అయితే ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఇప్పటివరకు అభిమానులకు అసలైన ట్రీట్ ఇవ్వలేదు. మొత్తంగా ఈ టోర్నమెంట్‌లో 39.20 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సెమీ-ఫైనల్‌లో నంబర్ 1 బ్యాటర్ గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటే, యంగ్ ప్లేయర్ నంబర్ 1 అవ్వడమే కాకుండా, పాకిస్తాన్‌కు చెందిన బాబర్ ఆజం రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో, వైభవ్ సూర్యవంశీ అండర్-19 వన్డేలలో నంబర్ 1 యాక్టివ్ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. ఇందుకోసం సెమీ-ఫైనల్‌లో వైభవ్ 93 పరుగులు చేయాల్సి ఉంటుంది. బాబర్ ఆజం 36 అండర్-19 వన్డేల్లో 35 ఇన్నింగ్స్‌ల్లో 1271 పరుగులు చేశాడు. పరుగుల పరంగా బాబర్ ఆజంను అధిగమించడానికి వైభవ్ సూర్యవంశీకి 103 పరుగులు అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్