భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రశంసలు కురిపించారు. అండర్-19 వరల్డ్ కప్, ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్,
టీ20 క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడని వాన్ కొనియాడారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే వైభవ్ ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాలని సూచించారు. జూలై 1న ఇంగ్లాండ్‌తో జరిగే
టీ20 సిరీస్‌లో వైభవ్ ఆడితే, టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు.