తెలుగుదేశం పార్టీ అధిష్టానం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి వైకుంఠం జ్యోతిని కొత్త ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. ఆమె టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వైకుంఠం ప్రసాద్ సతీమణి. గతంలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వీరభద్ర గౌడ్‌ను తొలగించారు. వైకుంఠం కుటుంబానికి టీడీపీతో మొదటి నుంచి అనుబంధం ఉంది. 2029 ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని జ్యోతి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. వైకుంఠం శ్రీరాములు ఆశయాలను నెరవేరుస్తామని, కార్యకర్తల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె వెల్లడించారు.