AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎన్డీయే ఆధ్వర్యంలో నిర్వహించిన అటల్ సందేశ్- మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొన్న మంత్రి లోకేశ్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, ఆయన అవినీతి మచ్చలేని నేత అని తెలిపారు. చంద్రబాబు, వాజ్‌పేయీకి తండ్రికుమారుల వంటి అనుబంధం ఉందని, తెలుగు జాతి ఆయనకు రుణపడి ఉందని అన్నారు.