వల్లభనేని వంశీ అనుచరుడు రామాంజనేయులు అరెస్టు

65చూసినవారు
వల్లభనేని వంశీ అనుచరుడు రామాంజనేయులు అరెస్టు
AP: సత్యవర్ధన్‌ అపహరణ, దాడి కేసులో వల్లభనేని వంశీ అనుచరుడైన యర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్‌ పొట్టి రామును పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. గత పది నెలలుగా నిందితుడు పోలీసులకు దొరక్కుండా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇటీవల విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. విచారణ అనంతరం నిందితుడిని శుక్రవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో న్యాయాధికారి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్