AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా, ఉండగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతో పాటు ఆయన ప్రధాన అనుచరడు మోహన్ రంగారావుకు కూడా రిమాండ్ విధించారు. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.