బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. దంపతులు మృతి

5929చూసినవారు
బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్.. దంపతులు మృతి
AP: మంగళగిరికి చెందిన నాగేశ్వరరావు (65), ధనలక్ష్మి (57) దంపతులకు ఇద్దరు సంతానం. శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం కుమార్తె ఇంటికి గుంటూరు వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత బైక్‌పై మంగళగిరి బయలుదేరారు. విజయవాడ బైపాస్‌లోకి ప్రవేశించాక.. దారి తప్పామని గమనించారు. మంగళగిరి వైపు వెళ్లేందుకు వెనక్కి వస్తుండగా.. వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఎయిమ్స్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్