తెలంగాణంలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో ఒక అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. దహెగాం రామాలయంలో హనుమాన్ విగ్రహానికి పూజలు జరుగుతుండగా, ఒక వానరం అక్కడికి వచ్చి స్వాములు మంగళహారతి ఇస్తుండగా, పూజలు పూర్తయ్యే వరకు వేచి చూసింది. అనంతరం హనుమాన్ విగ్రహానికి నమస్కరించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లిపోయింది. స్వాములు దీనిని భగవాన్ హనుమంతుడే వానర రూపంలో వచ్చి దర్శనమిచ్చాడని భావిస్తున్నారు.