బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. త్వరలో ప్రారంభం

12419చూసినవారు
బెంగళూరుకు చేరుకున్న రెండో వందే భారత్ స్లీపర్.. త్వరలో ప్రారంభం
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొత్త వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సాంకేతికతతో BEML అభివృద్ధి చేసిన ఈ రైలు, నారింజ, బూడిద రంగుల కలయికతో ఆకర్షణీయంగా ఉంది. ఇది కెఎస్‌ఆర్ బెంగళూరు – ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ – ముంబై మధ్య నడవనుంది. దేశంలో ఇది రెండవ వందే భారత్ స్లీపర్ రైలు. ప్రస్తుతం తుది పరీక్షల కోసం బెంగళూరులోని ఎస్‌ఎమ్‌విటి (SMVT) స్టేషన్‌లో ఉంచారు. BEML ఆధ్వర్యంలోనే తనిఖీలు, పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని అనుమతులు వచ్చాక అధికారికంగా ప్రారంభించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్