రైల్వే ప్రయాణికులను ఆకట్టుకుంటున్న వందే
భారత్ రైలులో ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వేస్ సరికొత్త నిబంధనలు, అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది. మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోతే, రైలు వెనుక భాగంలో ఉండే గార్డ్ కోచ్ ద్వారా ప్రయాణికులు లోపలికి ప్రవేశించవచ్చు. ఒకవేళ స్టేషన్‌లో దిగలేకపోతే, డోర్ల వద్ద ఉండే ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్ ద్వారా సిబ్బందిని అప్రమత్తం చేయాలి. దిగాల్సిన స్టేషన్ దాటితే, టీటీఈని సంప్రదించి తదుపరి చర్యలు తీసుకోవాలి. అత్యవసర అలారం చైన్ లాగడం, డోర్లను బలవంతంగా తెరవడం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరించారు.