వైసీపీకి వంగా గీత, ముద్రగడ పద్మనాభం పార్టీ గుడ్ బై?

41చూసినవారు
వైసీపీకి వంగా గీత, ముద్రగడ పద్మనాభం పార్టీ గుడ్ బై?
AP: వైసీపీకి గట్టి పట్టున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తాజా పరిణామాలు జగన్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో మౌనంగా ఉన్న వంగా గీత, ముద్రగడ పద్మనాభం పార్టీ వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో జగన్‌కు మద్దతుగా నిలిచిన ముద్రగడ పద్మనాభం, కూటమి విజయం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేతిలో ఓటమి పాలైన వంగా గీత, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్