AP: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్
ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మేయర్ పదవికి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన గురువారం డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమి అధికారంలోకి వచ్చినా రాధాకు పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ మేయర్ పదవి ఆయనకు దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు బలపడుతున్నాయి.