AP: విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా కుటుంబం మళ్లీ చర్చనీయాంశమైంది. రంగా కుమార్తె ఆశ కిరణ్ రాజకీయాల్లోకి రావచ్చన్న ప్రచారం జోరందుకుంది. రంగా విగ్రహానికి నివాళి అర్పించిన ఆమె, పూర్తిస్థాయి రాజకీయ ప్రవేశాన్ని ఖండించకుండా “త్వరలో మాట్లాడతాను” అని తెలిపారు. రంగా ఒక్క కాపు నేతకాదని, ఆయన వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాధా రంగా మిత్ర మండలిలో విభేదాలు ఉన్నాయని, అభిమానులను కలుస్తూ ముందుకు వెళతానని చెప్పారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు.