వైసీపీలోకి వంగవీటి కుమార్తె ఆశాకిరణ్?

24చూసినవారు
వైసీపీలోకి వంగవీటి కుమార్తె ఆశాకిరణ్?
AP: వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశంపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆశా కిరణ్ త్వరలోనే క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తుండగా, ఆమె ఏ పార్టీలో చేరుతారన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా ఉంది. అయితే, తాజాగా ఆమె వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఆమె వైసీపీలో చేరతారా అనే ఊహాగానాలు మరింత ఊపందుకుంటున్నాయి. రంగా కుమార్తె రాజకీయ ప్రవేశం ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్