వాయుగుండం.. 5 రోజులపాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు

12చూసినవారు
వాయుగుండం.. 5 రోజులపాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు
AP: ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఇది క్రమంగా బలపడుతూ సోమవారానికి వాయుగుండంగా, మంగళవారం నాటికి  తీవ్రవాయుగుండంగా బలపడి, బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయంది. రానున్న ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్