వెనెజువెలా భూకంపాలు.. 58వేల భవనాలు ధ్వంసం

2254చూసినవారు
వెనెజువెలా భూకంపాలు.. 58వేల భవనాలు ధ్వంసం
వెనిజులాలో ఇటీవల సంభవించిన జంట భూకంపాల వల్ల 58 వేలకు పైగా భవనాలు ధ్వంసమైనట్లు నాసా అంచనా వేసింది. జూన్ 25న సేకరించిన ఉపగ్రహ డేటా ఆధారంగా ఈ లెక్కలు వెల్లడయ్యాయి. అయితే, వెనిజులా నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ జార్జ్ రోడ్రిగ్జ్ 855 భవనాలు దెబ్బతిన్నాయని, వాటిలో 189 పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు. వేల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారనే ఆందోళన నెలకొంది. గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్