అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో బన్నీ మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. మరోవైపు బన్నీకి బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలివ్వాలని పోలీసులు కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.