ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ
నియామకాలు, సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మాన్యువల్ విధానంలో జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ‘డిజీ వెరిఫై’ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించాలని సూచించింది. ఈ నూతన విధానం వల్ల జాప్యం తగ్గి, అర్హులకు సకాలంలో ప్రభుత్వ
ఉద్యోగాలు, పథకాల ఫలాలు అందుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు.