పిఠాపురంలో వర్మ తొలగింపు.. కూటమి రాజకీయాలే కారణమా?

0చూసినవారు
పిఠాపురంలో వర్మ తొలగింపు.. కూటమి రాజకీయాలే కారణమా?
AP: పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పార్టీ అధిష్టానం తొలగించింది. జనసేనతో సమన్వయం విషయంలో వర్మ వ్యవహార శైలి పార్టీకి ఇబ్బందిగా మారిందని, కూటమి రాజకీయాలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడంపై వర్మ అభ్యంతరం వ్యక్తం చేయడం, జనసేన నేతతో వాగ్వాదం వంటి సంఘటనలు ఈ తొలగింపునకు దారితీసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్