ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ టోల్కన్(94) కన్నుమూశారు. న్యూయార్క్‌లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు మేనేజ్మెంట్ ధృవీకరించింది. 'బ్యాక్ టు ది ఫ్యూచర్', 'టాప్ గన్' వంటి చిత్రాలతో నటించి టోల్కన్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. తెరపై కఠినమైన ప్రిన్సిపాల్, కమాండర్ పాత్రల్లో మెప్పించిన ఆయన నిజ జీవితంలో ఎంతో దయగల వ్యక్తిగా పేరుగాంచారు. ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది.