AP: విజయవాడ ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. బుధవారం పున్నమి ఘాట్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. నేడు ప్రారంభమైన దసరా ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొత్తం 280 ప్రదర్శనలు నిర్వహించనున్నారు. దేశంలోని ప్రముఖ సంగీత కళాకారులు పొల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.