VIDEO: బైక్‌ను ఢీకొట్టిన ఎద్దు.. లారీ కిందపడి యువకుడు మృతి!

8852చూసినవారు
యూపీలోని గాజీపూర్‌లో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. బైక్‌పై వెళ్తుండగా పొదల నుంచి హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చిన అడవి ఎద్దు బైక్‌ను తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన యువకుడిపై నుంచి వెనుకగా వస్తున్న ట్రైలర్ వాహనం దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్