VIDEO: మంత్రి సత్యకుమార్ ఇలాకాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

0చూసినవారు
AP: ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ నియోజకవర్గంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీలకు యత్నించిన దుండగులు, కిటికీ తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఇంటి యజమానులు శబ్దంతో అప్రమత్తం కావడంతో దొంగలు పరారయ్యారు. సీసీ కెమెరాల్లో ఏడుగురు సభ్యుల ముఠా కదలికలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ధర్మవరం పట్టణంలో ఆందోళన నెలకొంది. చెడ్డీ గ్యాంగ్ కోసం క్లూస్ టీం రంగంలోకి దిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్