AP: తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్ కోసం రైతులు సన్నద్ధం కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. చాగల్లులో ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ పొలంలో సోమవారం నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, రైతులకు 35 వేల పీఎండీఎస్ కిట్లను పంపిణీ చేశారు. జిల్లాలో 96,266 హెక్టార్లలో వరి సాగు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.