VIDEO: కాలేజీ బస్సును ఢీకొట్టిన క్రేన్.. 50 మంది విద్యార్థులు సేఫ్!

39చూసినవారు
తమిళనాడులోని ఈరోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఒక భారీ క్రేన్ ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా రావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎదురుగా వస్తున్న కాలేజీ బస్సును గమనించకుండా క్రేన్ డ్రైవర్ వాహనాన్ని మళ్లించడంతో బస్సు దాదాపుగా దానిని ఢీకొట్టినంత పని జరిగింది. ఆ సమయంలో బస్సులో 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును నిలిపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్