AP: తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ మొంథా విశ్వరూపాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం 12 KM వేగంతో పయనిస్తూ మచిలీపట్నం, కాకినాడ తీరంవైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో సముద్రపు అలలు ఎగసి పడుతున్నాయి. కాకినాడ దగ్గర ఉప్పాడ, విశాఖపట్నం వద్ద అలల తాకిడితో తీరప్రాంత రోడ్లు ధ్వంసమయ్యాయి. అలల తీవ్రతతో ఉప్పాడ వద్ద రహదారి పొడవునా వేసిన బండరాళ్లు కూడా రోడ్డుపైకి పడుతున్నాయి. ఆ రూట్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.