VIDEO: విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల ధర్నా

22చూసినవారు
AP: స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో తమ ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్త మీటర్ రీడింగ్ కార్మికులు శనివారం విజయవాడ ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. స్మార్ట్ మీటర్ల వల్ల తమ భవిష్యత్తు అంధకారమవుతోందని, విద్యుత్ సంస్థలోనే తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం అమలు చేయాలని వారు నినదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్