VIDEO: తాళం వేసిన ఇంట్లో పేలుడు

9201చూసినవారు
మహారాష్ట్రలోని కొల్హాపూర్ సుర్వే నగర్‌లో బుధవారం తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించి స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆ ఇంటిని నాశనం చేసే కుట్రతోనే జిలాటిన్ స్టిక్స్ ఉపయోగించి ఈ పేలుడుకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పేలుడు తీవ్రతకు ఆ ఇల్లు పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పక్కనే ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్