VIDEO: రైలు డోరు దగ్గరున్న యువతికి సైగలు.. దిమ్మతిరిగే ట్విస్ట్‌!

2698చూసినవారు
జూన్ 29న వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న రూపాలీ దీక్షిత్ అనే మహిళా ప్రయాణికురాలిని చూసి రైల్వే ట్రాక్‌పై నిలుచున్న ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రైలు గేటు దగ్గర నిలబడిన ఆమెకు సదరు వ్యక్తి అసభ్య సైగలు చేశాడు. దీనిని గమనించిన మహిళ వీడియో తీసి, రైల్వే శాఖ, రైల్ మదద్, ఆర్‌పీఎఫ్‌లకు ఫిర్యాదు చేశారు. రైల్వే రక్షణ దళం స్పందించి, కేసును హౌరా డివిజన్‌కు బదిలీ చేసింది. ఆర్‌పీఎఫ్ ఈస్టర్న్ రైల్వే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్