VIDEO: మెడికల్ షాపులోకి చొరబడి కెమిస్ట్‌పై కాల్పులు

6606చూసినవారు
చండీగఢ్‌లోని సెక్టార్ 11లో ఉన్న 'శ్రీ కుమార్ మెడికోస్' అనే మెడికల్ షాపులోకి ఇద్దరు చొరబడి, కెమిస్ట్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ పట్టపగలు జరిగిన దాడిలో కెమిస్ట్ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల సమయంలో దుకాణంలోని సిబ్బంది, కస్టమర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్