VIDEO: గోదావరికి పోటెత్తిన భారీ వరద.. ఆ జిల్లాలకు అలర్ట్

1చూసినవారు
AP: గోదావరి నదికి భారీ వరద పోటెత్తింది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉందని, ఈరోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని SDMA వెల్లడించింది. పోలవరం, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, నదిలో స్నానం, చేపలు పట్టడం వంటివి చేయరాదని హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్