VIDEO: ఏపీలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

2చూసినవారు
AP: తిరుపతి జిల్లా రేణిగుంటలో వాతావరణం ఒక్కసారిగా మారింది. రేణిగుంట వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పరిసర ప్రాంతాల్లో వడగండ్ల వాన కూడా కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈ వర్షంతో ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోయి, రోడ్లు జలమయమయ్యాయి. దీంతో రేణిగుంట ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్