VIDEO: ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

21953చూసినవారు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణుల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ప.గో. జిల్లాలో పలు చోట్ల మోస్తరు వాన పడుతోంది. యానాంలో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యానాం పోలీస్ స్టేషన్, పిల్లరాయ స్వామి ఆలయం, పలు ఇళ్లల్లో వరద నీరు చేరింది.

సంబంధిత పోస్ట్