AP: డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలకు నిరసనగా విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టాలని
వైసీపీ పిలుపునిచ్చింది. అయితే, నిరసన ర్యాలీకి అనుమతి లేదని పెనమలూరు వైసిపి ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తికి పెనమలూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. డీఎస్సీ నిరసనలో పాల్గొంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో నిరసన కార్యక్రమంపై ఉత్కంఠ నెలకొంది.