రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిర్వహించిన సభలో 15 నిమిషాల వ్యవధిలోనే మూడుసార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాని
మోదీ గొప్ప పనుల గురించి మంత్రి మాట్లాడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి కూడా అదే సభలో ఉండటం గమనార్హం. కరెంట్ లేకపోవడంతో సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులో సభ కొనసాగింది.