పశ్చిమ బెంగాల్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి తన ఇంటి ముందుకు వచ్చి రాళ్లతో దాడి చేశాడంటూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ రాళ్లదాడి కారణంగా ఇంటి కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఆయన సాక్ష్యంగా పంచుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.