VIDEO: విశాఖలో ఏయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల ఆందోళన

26చూసినవారు
AP: విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు భారీ ఆందోళనకు దిగారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు యూనివర్సిటీలోని శాతవాహన హాస్టల్ భవనం పైకప్పుల నుంచి నీరు కారిపోతుండటంతో వసతి గదులు జలమయమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించడంలో మరియు భవన మరమ్మత్తులపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్