AP: నెల్లూరు రూరల్ పరిధిలోని జొన్నవాడ ఆర్చి సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం, ఎవరో గుర్తుతెలియని మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.