యూపీలోని హమీర్‌పూర్ జలాల్‌పూర్ PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. పొరుగున ఉండే ఒక యువకుడు, ఒక యువతి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను డిలీట్ చేస్తానని నమ్మించి, ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడు వీడియోను వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగుతుండటంతో, బాధితురాలు న్యాయం కోసం బండా ఐజీని ఆశ్రయించి వేడుకుంది.