టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక తమ వివాహాన్ని ఫిబ్రవరి 26, 2026న ఉదయపూర్ లోని ఒక ప్యాలెస్ లో ఘనంగా జరుపుకున్నారు. వివాహం అనంతరం మార్చి 4న హైదరాబాద్ లో సినీ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ నిర్వహించారు. ఇటీవల రష్మిక పుట్టినరోజు సందర్భంగా, ఆమె స్వస్థలమైన కర్ణాటకలోని కూర్గ్ లో కొడగు సాంప్రదాయంలో మరో రిసెప్షన్ ను నిర్వహించారు. ఈ రిసెప్షన్ కు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.