దర్శకుడు పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్
సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న పాన్-
ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా చిత్రయూనిట్ ఈ టీజర్ వెనుక ఉన్న కష్టాన్ని, షూటింగ్ విశేషాలను చూపిస్తూ ఒక పవర్‌ఫుల్ “టీజర్ మేకింగ్ వీడియో”ను విడుదల చేసింది. ఈ మేకింగ్ వీడియోలో దర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన మార్క్ స్టైల్‌లో సీన్లను ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో స్పష్టంగా కనిపిస్తోంది.