
అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. క్రికెటర్ చేయి పట్టి లాగిన మహిళ అభిమాని
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ తన హోటల్ గదికి వెళ్తుండగా ఒక మహిళా అభిమాని అతడి చేతిని పట్టుకొని లాగింది. దీంతో అభిషేక్ అసౌకర్యానికి గురయ్యాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పురుష అభిమాని ఇలా చేసి ఉంటే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చేవి అని అభిప్రాయపడ్డారు. అభిమానం హద్దు మీరకూడదని, క్రీడాకారుల వ్యక్తిగత గౌరవాన్ని గుర్తించాలని పలువురు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

































