
తుఫాన్ ప్రభావం: రైల్వే ప్రయాణికుల సేవకు క్యూఆర్టీ టీం సిద్ధం
మొంథా తుఫాను కారణంగా రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు బొబ్బిలి ఆర్పిఎఫ్ పోలీసులతో కలిసి క్యూఆర్టీ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తాగునీరు, భోజనం, బిస్కెట్ ప్యాకెట్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. రైల్వే ట్రాక్‌లకు నష్టం జరగకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ చంద్ర పండా తెలిపారు.





































