బెర్రీ కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

4చూసినవారు
బెర్రీ కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
బొబ్బిలిలోని గ్రోత్ సెంటర్‌లోని బెర్రీ కంపెనీలో గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మునకాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, కంపెనీలో భద్రతా పరికరాలు కల్పించాలని కోరారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, కార్మికుల భద్రతను అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్