బొబ్బిలి పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసుల వినియోగం టన్నుల కొద్దీ కొనసాగుతున్నా సంబంధిత అధికారులు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని
కాంగ్రెస్ నాయకుడు మువ్వల శ్రీనివాసరావు విమర్శించారు. గతంలో ప్లాస్టిక్ రహిత బొబ్బిలిగా గుర్తింపు తెచ్చిన స్థాయిని తిరిగి సాధించాలని, ప్లాస్టిక్ సరఫరాపై కఠిన తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను అరికట్టాలని, ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.