తెర్లాంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన బేబీనాయన

605చూసినవారు
తెర్లాంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన బేబీనాయన
విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) శుక్రవారం పరిశీలించారు. నందిగామలో వర్షపునీటికి కోతకు గురైన గట్టును, బూరిపేట–ఎన్. బూర్జవలస గ్రామాల మధ్య చెరువు వద్ద దెబ్బతిన్న రోడ్డును ఆయన పరిశీలించి, నష్టాన్ని అంచనా వేశారు. ఈ పర్యటనలో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, తెర్లాం మండల టీడీపీ అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేష్ తదితరులు ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు.

సంబంధిత పోస్ట్