తోటపల్లి కాలువ గండితో పక్కి బీసీ కాలనీకి ముంపు

557చూసినవారు
తోటపల్లి కాలువ గండితో పక్కి బీసీ కాలనీకి ముంపు
తోటపల్లి కాలువకు గండి పడటంతో బొబ్బిలి మండలం పక్కి గ్రామంలోని బీసీ కాలనీ ముంపునకు గురైంది. ఈ విషయాన్ని గ్రామ పెద్దలు ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబీనాయన) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఆర్డీవో, ఎంపీడీవో, రెవెన్యూ, ఇరిగేషన్, పశువైద్య, పోలీస్, సచివాలయ శాఖల అధికారులు, సిబ్బంది బీసీ కాలనీని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రభావిత కుటుంబాలను పక్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించి భోజన వసతి, ఇతర సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అన్ని శాఖలు సమన్వయంతో స్పందించి సహాయక చర్యలు చేశారు.

సంబంధిత పోస్ట్