సేంద్రియ ఎరువు బిన్ల పంపిణీ, నీటి సరఫరా, ఇంటింటా చెత్తసేకరణ, వ్యర్థాల నిర్వహణ, మురునీటి కాలువల సంరక్షణ, మిద్దె తోటల ప్రోత్సాహం, రహదారులు–వీధి దీపాల నిర్వహణ, ఆస్తిపన్ను వసూళ్లలో బొబ్బిలి పురపాలిక రాష్ట్రస్థాయిలో 6వ స్థానంలో నిలిచింది. చెత్త శుద్ధి సంస్కరణల్లో రాష్ట్రంలో 2వ స్థానం, జోన్ స్థాయిలో 8వ స్థానం దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్–2024-25లో ఇంటింటా చెత్త సేకరణ విభాగంలో రాష్ట్రంలో 10వ, జోనల్ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. పురపాలకాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని కమిషనర్ రామలక్ష్మి తెలిపారు.